సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’ టీజర్ రిలీజ్ సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సిద్ధూ మార్కు కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్, ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలన్స్ చేసిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. తన మిషన్ పేరు బటర్‌ఫ్లై అంటూ సిద్ధూ సందడి చేశారు. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్ధూ చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేశ్…
Read MoreCategory: Videos
Videos
Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ప్రారంభం – వీడియో మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభమయింది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేశ్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నాగబాబు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ దిల్ రాజు, దర్శకుడు బాబీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు మెగా 157 (#Mega157), చిరు అనిల్ (#ChiruAnil) అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు.
Read MoreArjun Son Of Vyjayanthi Teaser: ఆకట్టుకుంటున్న కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ టీజర్..!
ఆకట్టుకుంటున్న కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ టీజర్..! హీరో కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన ప్రీ-టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ దృశ్యాలతో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీజర్‌లో విజయశాంతి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపిస్తుండగా, ఆమె కొడుకు…
Read MoreKannappa Movie : కన్నప్ప మేకింగ్ వీడియో పంచుకున్న మంచు విష్ణు
కన్నప్ప మేకింగ్ వీడియో పంచుకున్న మంచు విష్ణు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ మూవీ “కన్నప్ప“ ఈ వేసవిలో ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో “కన్నప్ప” టీమ్ ప్రమోషన్ వేగం పెంచింది. తాజాగా, మంచు విష్ణు “కన్నప్ప” మేకింగ్ వీడియోను పంచుకున్నారు. ఈ సినిమాను 위해 వారు చేసిన పరిశోధన, ఎన్నో డిస్కషన్లు, పెట్టిన కష్టం—all these aspects were highlighted in the video. దర్శకుడితో కలిసి తాను 24 క్రాఫ్ట్స్‌ను సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాడో వివరించారు.…
Read MoreKannappa : కన్నప్ప టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్
కన్నప్ప టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 84 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో విష్ణు పవర్‌ఫుల్ నటన, శక్తివంతమైన విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, రివేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చివర్లో కనిపించిన ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన ‘శివ శివ శంకరా’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వివిధ భాషల ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో…
Read MoreSree Vishnu : శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల
శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల తరచుగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయకుడు శ్రీ విష్ణు, తన ప్రత్యేకమైన శైలితో యువ హీరోలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ప్రతిసారి విభిన్నమైన జానర్‌లను ఎంచుకుంటూ, తన నటనతో సినీ ప్రేమికులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరుకు పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనదిగా నిలుస్తున్న చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రానికి షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య గుణ్ణం సమర్పణలో, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబా జాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల…
Read MorePrabhudeva : వారసుడు రిషి రాఘవేంద్రను పరిచయం చేసిన ప్రభుదేవా!
వారసుడు రిషి రాఘవేంద్రను పరిచయం చేసిన ప్రభుదేవా! భారతీయ సినిమా నృత్య చరిత్రలో ప్రభుదేవా పేరు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఒంట్లో ఎముకలున్నాయా లేదా అన్నట్లుగా స్ప్రింగులా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ప్రభుదేవా మాస్టర్‌కు చెందిన ప్రత్యేకత. మైకేల్ జాక్సన్ కు భారతీయ వెర్షన్ గా పేరు పొందిన ప్రభుదేవా, కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా కూడా తన బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా, ప్రభుదేవా తన వారసుడిని ఒక ఈవెంట్ లో పరిచయం చేశారు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రభుదేవా, ఆయన కొడుకు రిషి రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు హాజరై, తండ్రీకొడుకులు కలిసి డ్యాన్స్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసారు. ఈ వీడియోను ప్రభుదేవా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు.…
Read MoreNani : ఒళ్లు గగుర్పొడిచేలా ‘హిట్-3’ విజువల్స్
ఒళ్లు గగుర్పొడిచేలా ‘హిట్-3’ విజువల్స్ నాని బర్త్డే సందర్భంగా ‘హిట్-3’ టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ నేచురల్ స్టార్ నాని బర్త్డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హిట్-3 టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1న విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో ఊహించని షాకులు బోలెడిచ్చారు. శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. అక్కడ జరిగే వరుస హత్యలు.. పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ వాటిని ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండనుంది. ఊర మాస్ పోలీస్ గా నాని భయంకరంగా ఉన్నాడు. రావు రమేశ్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇతర పాత్రధారులను రివీల్ చేయకుండా టీజర్ కట్…
Read MoreHari Hari Veera Mallu | ఫిబ్రవరి 24న హరిహర వీరమల్లు ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ రిలీజ్
ఫిబ్రవరి 24న హరిహర వీరమల్లు ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ రిలీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద చిత్రం ‘హరిహారా వీరమల్లు పార్ట్ -1: స్వోర్డ్ ఆఫ్ స్పిరిట్’ తో వస్తున్నారు. ఈ పీరియడ్ చిత్రం నుండి రెండవ సింగిల్ విడుదల అవుతుంది. ‘కొల్లగొట్టిందిరో‘ పాట ఫిబ్రవరి 24 న విడుదల కానుంది … ఈ పాట యొక్క ప్రోమో ఈ రోజు విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ ప్రోమోకు ప్రతిస్పందన సాధారణం కాదు. ఇష్టాలు మీటర్ నడుస్తోంది. ఈ పాటలో, “కోరా కోరా మీసలతో కోడామా కోడామా ఆద్తాసోథో” లాగా, పవన్‌తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ మరియు నటి అనసుయాతో చూడవచ్చు. చంద్రబోస్ ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరావాని అందించిన సంగీతానికి సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహారా,…
Read MoreJabilamma Neeku Antha Kopama : ధనుష్ తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ట్రైలర్ ను విడుదల
ధనుష్ తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ట్రైలర్ ను విడుదల తమిళ నటుడు ధనుష్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా‘. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తే, ఈ చిత్రం యూత్ ఎంటర్టైనర్గా వచ్చినట్లు తెలుస్తోంది. ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ధనుష్ చెప్పిన ‘జాలీ కమ్.. జాలీ గో “డైలాగ్ ఆకట్టుకుంది. పావిశ్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జి. వి. ప్రకాష్ సంగీతం అందించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం…
Read More