బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పారు. దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆకాంక్షించారు. అప్పటి వరకు బాగానే ఉన్నా, తన డైమండ్ రింగ్, రోలెక్స్ వాచీని చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన ఊర్వశి.. సైఫ్‌కి క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది.
సైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు తాను ప్రవర్తించిన తీరుకు ఊర్వశి విచారం వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూలో సైఫ్‌పై దాడి తీవ్రత తనకు తెలియదని చెప్పింది. కొన్ని రోజులుగా డాకు మహారాజ్ సినిమా విజయంపై మూడ్ లో ఉన్నానని వివరించింది. దీంతో సినిమా ద్వారా తనకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడిన ఆమె.. ఇందుకు సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది. దాడి తీవ్రత తెలిసిన తర్వాత చాలా బాధపడ్డానని చెప్పింది. ఆ సమయంలో అతని ధైర్యసాహసాలను మెచ్చుకుంది. మీపై గౌరవం మరింత పెరిగిందని చెప్పింది.
ఏమి జరిగింది?
డాకు మహారాజ్ సినిమా సక్సెస్ తర్వాత చాలా మంది తనకు బహుమతులు పంపారని ఊర్వశి ఇంటర్వ్యూలో తెలిపింది. సైఫ్ పై దాడి దురదృష్టకరమని, తాను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 150 కోట్లు. సినిమా విజయం సాధించడంతో తన తల్లి తనకు డైమండ్ రింగ్ ఇచ్చారని, నాన్న తనకు రోలెక్స్ వాచ్ ఇచ్చారని ఆమె ఆనందంగా చెప్పింది. అయితే మనపై ఎవరైనా అలా (సైఫ్‌పై దాడి చేసినట్లు) దాడి చేస్తారేమోనన్న భయంతో ఇవన్నీ వేసుకుని పబ్లిక్‌గా బయటకు వెళ్లలేనని చెప్పింది. సైఫ్‌పై దాడికి, ఆమె బహుమతులకు లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి క్షమాపణలు చెప్పింది.
Read : Kajal Aggarwal : ‘కన్నప్ప’ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్.. ఫస్ట్ లుక్ విడుదల