Allu Arjun: అల్లు అర్జున్ కొత్త సినిమాలో విల్ స్మిత్?

allu arjun will smith

అల్లు అర్జున్ కొత్త సినిమాలో విల్ స్మిత్? అల్లు అర్జున్ తాజా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఈ చిత్రంలో నటించనున్నారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించనుండగా, విల్ స్మిత్‌ను కీలక పాత్రలో కుదించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆస్కార్ విజేత అయిన 56 ఏళ్ల విల్ స్మిత్, ‘మెన్ ఇన్ బ్లాక్’ లాంటి గ్లోబల్ హిట్‌లతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. ఆయన నటనకు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. ఇటీవలి కాలంలో ఆయన చాలా సెలెక్టివ్‌గా ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమాకు ఆయనను ఎంపిక చేసేందుకు అట్లీ బృందం గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఇండస్ట్రీ…

Read More