ఆకట్టుకుంటున్న కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ టీజర్..! హీరో కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన ప్రీ-టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ దృశ్యాలతో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీజర్‌లో విజయశాంతి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపిస్తుండగా, ఆమె కొడుకు…
Read More