అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ చెప్పిన రష్మిక, విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షల సందడి సోషల్ మీడియా వేదికగా కొనసాగుతోంది. అభిమానులే కాదు, పలువురు సినీ ప్రముఖులు కూడా బన్నీకి విషెస్ చెబుతున్నారు. తాజాగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “అల్లు అర్జున్ సర్… ఇవాళ మీ బర్త్ డే… సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటారనుకుంటున్నాను. మీరు ఎప్పుడూ ఓ రేంజిలో సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజు మీకు జీవితంలోనే హ్యాపియెస్ట్ బర్త్ డే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీపై అపారమైన ప్రేమాభిమానాలు” అంటూ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ కూడా బన్నీ…
Read More