మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ZEE5, ZEE తెలుగు చానళ్లలో ఒకేసారి ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. రేపు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన అనంతరం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ప్రత్యేకంగా ZEE తెలుగులో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ZEE5 ఓటీటీ వేదికపై తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా విడుదల చేస్తున్నారు, తద్వారా విభిన్న భాషల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. వెంకటేశ్ స్పందిస్తూ…‘‘ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించడం…
Read More