Urvashi Rautela: సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు

urvashi routhela

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశి రౌతేలా క్షమాపణలు చెప్పారు. దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆకాంక్షించారు. అప్పటి వరకు బాగానే ఉన్నా, తన డైమండ్ రింగ్, రోలెక్స్ వాచీని చూపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన ఊర్వశి.. సైఫ్‌కి క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది. సైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు తాను ప్రవర్తించిన తీరుకు ఊర్వశి విచారం వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూలో సైఫ్‌పై దాడి తీవ్రత తనకు తెలియదని చెప్పింది. కొన్ని రోజులుగా డాకు మహారాజ్ సినిమా విజయంపై మూడ్ లో ఉన్నానని వివరించింది. దీంతో సినిమా ద్వారా తనకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడిన ఆమె.. ఇందుకు సిగ్గుపడుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది. దాడి తీవ్రత తెలిసిన తర్వాత చాలా బాధపడ్డానని చెప్పింది. ఆ…

Read More