Touch Me Not : ‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ రివ్యూ!

touch me now web series

‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్ రివ్యూ! జియో సినెమా-హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి మరో ఆసక్తికరమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘టచ్ మీ నాట్’ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. గతంలో కొన్ని సినిమాలు తెరకెక్కించిన రమణతేజ ఈ సిరీస్‌కు దర్శకుడిగా వ్యవహరించారు. నవదీప్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్‌సిరీస్ 6 ఎపిసోడ్స్ రూపంలో 7 భాషల్లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కొరియన్ సిరీస్ ‘He is Psychometric’ ఆధారంగా తెరకెక్కించబడింది. కథా సారాంశం: 2009, హైదరాబాద్: దీపావళి సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో ‘మారుతి అపార్ట్‌మెంట్’లో నాలుగు మహిళలను దారుణంగా  హత్య చేసిన దుండగుడు ఆపై గ్యాస్ లీక్ చేసి అక్కడి నుంచి పరారవుతాడు. ఈ ప్రమాదంలో రాఘవ్ (నవదీప్) తన తల్లిని, రిషి (దీక్షిత్…

Read More