గాయని ప్రవస్తి ఆరోపణలపై స్పందన వీడియో విడుదల చేసిన నిర్మాత ప్రవీణ వర్ధమాన గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మరియు నిర్మాత ప్రవీణ్ కడియాల స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్పష్టతనిచ్చే వీడియోను ఆయన విడుదల చేశారు. ప్రవీణ్ మాట్లాడుతూ, “షోలో గాయకులు ధరించే దుస్తులు వారు ఎంపిక చేసుకున్న పాటకు అనుగుణంగా డిజైన్ చేయిస్తాము. వ్యక్తిగతంగా ఎవరికైనా ప్రత్యేక దుస్తులు తయారు చేయము. బాడీ షేమింగ్‌కు మా వద్ద ఎటువంటి స్థానం లేదు” అని స్పష్టం చేశారు. కాస్ట్యూమర్ తమపై “మీ శరీరానికి ఏ డ్రెస్సూ సరిపోదు” అన్నారని ప్రవస్తి చేసిన ఆరోపణపై స్పందిస్తూ, “అలాంటి వ్యాఖ్య తప్పు. కానీ అలాంటి ఘటన జరిగినట్లయితే వెంటనే నాతో లేదా షో డైరెక్టర్‌తో మాట్లాడాల్సింది. మేమెప్పుడూ ఎవరికైనా ఖచ్చితంగా ఇలా ధరించండి,…
Read More