మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ZEE5, ZEE తెలుగు చానళ్లలో ఒకేసారి ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. రేపు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన అనంతరం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ప్రత్యేకంగా ZEE తెలుగులో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ZEE5 ఓటీటీ వేదికపై తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా విడుదల చేస్తున్నారు, తద్వారా విభిన్న భాషల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. వెంకటేశ్ స్పందిస్తూ…‘‘ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించడం…
Read MoreTag: sankranthiki vasthunnam
Anil Ravipudi : దర్శకుడి కావాలనే కోరిక ‘పటాస్’తో తీరిందని, ఇప్పుడు అంతా బోనస్
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘ . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇంకా ఆశాజనకమైన కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అనిల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీ సినిమాలోని కామెడీని కొందరి జబర్దస్త్ స్కిట్‌లతో పోల్చడంపై మీ స్పందన ఏమిటని అడిగిన ప్రశ్నకు అనిల్, “ప్రేక్షకులు నా ప్రతి సినిమాని ఇష్టపడతారు, నా ప్రతి సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు విని నేను…
Read More