హీరో నాని సొంత బ్యానర్ నుంచి వచ్చిన చిత్రం ‘కోర్ట్’. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన కోర్ట్ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ, ఈ సినిమాపై తనకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అంతేగాక, “ఈ సినిమా లేకుంటే నా ‘హిట్ 3’ చూడొద్దు” అంటూ అందరి దృష్టిని ఈ సినిమాపై మళ్లించాడు. మరి, నిజంగానే ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా? చూద్దాం. కథ: 2013, విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. భర్తను కోల్పోయిన సీతారత్నం (రోహిణి) తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది. ఆమె కూతురు జాబిలి (శ్రీదేవి), ఇంటర్ చదువుతున్న చందూ (హర్ష్ రోషన్)ను తొలిసారిగా ఆటపట్టించేందుకు ప్రయత్నించి, ప్రేమలో పడుతుంది. చందూ ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు.…
Read More