ప్రభుదేవాను ప్రశంసలతో ముంచెత్తిన మాజీ భార్య ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా విడాకులు తీసుకున్న దశాబ్దానికిపైగా గడిచినా, ఆయన మాజీ భార్య రమ్లత్ ఇటీవల ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా తమ పిల్లల పట్ల ప్రభుదేవా చూపిస్తున్న ప్రేమ, జాగ్రత్త, బాధ్యతను ఆమె ఎంతో హృద్యంగా గుర్తు చేశారు. ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తండ్రిగా ప్రభుదేవా పాత్ర, వారి మధ్య ఉన్న ప్రస్తుత బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రభుదేవా – రమ్లత్ దాదాపు 16 సంవత్సరాల పాటు కలిసి జీవించి, 2011లో విడిపోయిన విషయం తెలిసిందే. కానీ విడాకుల తర్వాత కూడా వారు పిల్లల భవిష్యత్తు కోసం మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నారని రమ్లత్ తెలిపారు. “పిల్లలే ఆయనకి ప్రాణం. ఇద్దరు కుమారులతో ఆయనకి ఎంతో…
Read More