పెద్ది సినిమా పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు సానా బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “పెద్ది” చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ చిత్రం నిజమైన గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిని మించి యూనివర్సల్ లెవెల్‌లో కనిపిస్తున్నాడని ప్రశంసలు కురిపించారు. “హే సానా బుచ్చిబాబు… రాజమౌళి నుంచి నా వరకు ఎవ్వరూ రామ్ చరణ్ పవర్‌ను నీ అంతగా గ్రహించలేకపోయాం. నీ సినిమా మాత్రం గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్బంగా “పెద్ది” మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. Read : Peddi Movie: ‘పెద్ది’ టీం…
Read More