‘రాబిన్‌హుడ్’ – నితిన్, వెంకీ కుడుముల కాంబోలో మరో మాస్ ఎంటర్టైనర్! టాలీవుడ్ యువ నటుడు నితిన్ మరియు దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‘. ‘భీష్మ’ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 28న గ్రాండ్ రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కి – క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ ఎంట్రీ! ఈ సినిమాలో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, మైత్రీ మూవీ మేకర్స్ వార్నర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. “బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కు వస్తున్న వార్నర్‌కు భారత సినిమాకు స్వాగతం” అంటూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు.…
Read More