Niharika Konidela : తన రెండో సినిమాని ప్రకటించిన నీహారిక

niharika konidela

నిర్మాతగా నిహారిక కొణిదెల రెండో సినిమా ప్రకటించింది! మెగా డాటర్ నిహారిక కొణిదెల గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం రూ. 50 కోట్ల భారీ వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడేమో, నిహారిక నిర్మాతగా తన రెండో చిత్రాన్ని ప్రకటించింది! ఈ కొత్త చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా, సంగీత్ సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ఇదే. నిహారిక – సంగీత్ – మానస శర్మ కాంబో ఇదే ఫస్ట్ కాదు!…

Read More