కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ కన్నడ చిత్రసీమలో రూపొందిన ‘కౌసల్య సుప్రజా రామా‘ సినిమా, 2023 జులై 28న విడుదలైంది. బీసీ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్రల్లో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య, మిలన్ నాగరాజ్ నటించగా, ఈ చిత్రం కన్నడలో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ‘ఈటీవీ విన్’ ద్వారా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికి వస్తే… కథ: రామ్ (డార్లింగ్ కృష్ణ) ఓ మధ్య తరగతి యువకుడు. అతని తల్లి కౌసల్య (సుధ బెళవాడి), తండ్రి సిద్ధగౌడ (రంగయన రఘు). సిద్ధగౌడ మద్యం అలవాటుతో కుటుంబాన్ని పట్టించుకోడు. తండ్రి తీరు చూసి పెరిగిన రామ్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడు. చిన్నప్పటి నుంచి అతనితో చదువుకున్న మేనత్త కొడుకు సంతోష్ కూడా…
Read More