Kannappa : ‘క‌న్న‌ప్ప’ సినిమా విడుద‌ల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్

kannappa

‘క‌న్న‌ప్ప’ సినిమా విడుద‌ల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్ మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాలతో ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు సోష‌ల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరం అవుతుందని, అందువల్ల విడుదలను వాయిదా వేయవలసి  వచ్చిందని వివరించారు. “‘కన్నప్ప’ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు మా టీం ఎంతో కష్టపడుతోంది. మంచి అవుట్‌పుట్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొన్ని వారాలు పట్టే అవకాశం ఉన్నందున సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడం బాధగా ఉంది, కానీ ప్రేక్షకుల ఓపిక,…

Read More

Kannappa : కన్నప్ప టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

kannappa teaser

కన్నప్ప టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌ మంచు విష్ణు ప్రధాన పాత్రలో, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 84 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో విష్ణు పవర్‌ఫుల్ నటన, శక్తివంతమైన విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, రివేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చివర్లో కనిపించిన ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన ‘శివ శివ శంకరా’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వివిధ భాషల ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో…

Read More

Akshay Kumar : ముందు ‘కన్నప్ప’ సినిమాను తిరస్కరించాను

kannappa akshaykumar

ముందు ‘కన్నప్ప’ సినిమాను తిరస్కరించాను ముంబైలో నిర్వహించిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో ‘కన్నప్ప’ టీజర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అక్షయ్ కుమార్, నటుడు మంచు విష్ణు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అద్భుత విజయాన్ని సాధించింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ ‘కన్నప్ప’ టీజర్ అందరినీ ఆకర్షించింది. అక్కడి మీడియా ప్రతినిధులు టీజర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం విజువల్ మాయాజాలంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ప్రారంభంలో ‘కన్నప్ప’ ఆఫర్ నాకు వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించాను. కానీ భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను సరిపోయానని విష్ణు ఉంచుకున్న నమ్మకమే…

Read More

Kannappa Movie : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ క్రేజీ అప్డేట్

kannappa

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో డార్లింగ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ తాజాగా ఓ అద్భుతమైన అప్‌డేట్ ఇచ్చారు. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇందులో ప్రభాస్ కళ్లు, నుదురు మాత్రమే కనిపిస్తున్నాయి. నుదుటిపై విభూతి నామాలతో, చేతిలో త్రిశూలంతో డార్లింగ్ శక్తివంతంగా కనిపించింది. అయితే ఆ…

Read More

Kajal Aggarwal : ‘క‌న్న‌ప్ప‌’ చిత్రం నుంచి కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

kajal

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో పార్వతి దేవిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించనుందని చిత్ర బృందం ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. “విశ్వమాత! భక్తులను ఆదుకునే త్రిమూర్తులు! శ్రీకాళహస్తిలో దర్శనమిచ్చిన శ్రీజ్ఞాన్ ప్రసూనాంబిక! పార్వతీ దేవి” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఆమె అద్భుతమైన అందం మరియు దైవిక ఉనికికి సాక్ష్యమివ్వండి. ఆమె భక్తి, త్యాగం ఈ పురాణ కథకు ప్రాణం పోశాయని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలోని పలు కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల…

Read More