Kajal Aggarwal : ‘క‌న్న‌ప్ప‌’ చిత్రం నుంచి కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

kajal

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో పార్వతి దేవిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కనిపించనుందని చిత్ర బృందం ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. “విశ్వమాత! భక్తులను ఆదుకునే త్రిమూర్తులు! శ్రీకాళహస్తిలో దర్శనమిచ్చిన శ్రీజ్ఞాన్ ప్రసూనాంబిక! పార్వతీ దేవి” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఆమె అద్భుతమైన అందం మరియు దైవిక ఉనికికి సాక్ష్యమివ్వండి. ఆమె భక్తి, త్యాగం ఈ పురాణ కథకు ప్రాణం పోశాయని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలోని పలు కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల…

Read More