జైలర్ 2 లో బాలకృష్ణ కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడిన శివరాజ్ కుమార్ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించిన ఆయన, ప్రస్తుతం రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పెద్ది అనే సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఆయన 45 అనే చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో, మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో శివరాజ్ కుమార్, ఉపేంద్రలిద్దరూ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంలో ఓ విలేఖరి, “రజనీకాంత్ జైలర్ 2 సినిమాలో బాలకృష్ణతో కలిసి నటిస్తున్నారట కదా?” అని ప్రశ్నించగా, శివరాజ్ కుమార్ స్పందిస్తూ – “అవునా? నాకు తెలియదు. అయితే, ఆ సినిమాలో నా పాత్ర ఉందని దర్శకుడు నెల్సన్ చెప్పాడు” అని…
Read More