వివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్, రణ్‌దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు! బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాట్’ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసిందని ఆరోపణల నేపథ్యంలో, జలంధర్ పోలీసులు సన్నీ డియోల్‌తో పాటు నటులు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, ఆయనతో పాటు నిర్మాతలపై కూడా భారతీయ న్యాయసంహిత సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం. ఫిర్యాదుదారుడి వాదన ప్రకారం, ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమాలో క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా ఓ సన్నివేశం ఉందట. యేసు క్రీస్తును అవమానించేలా ఆ సీన్ చిత్రీకరించబడిందని, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పర్వదినాల…
Read More