తెలుగు హీరోయిన్లను ఎంకరేజ్ చేయకూడదని అనుకున్నాం ప్రముఖ తెలుగు నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్ నాయుడు) తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తాము తెలుగు రాని హీరోయిన్ లను అభిమానిస్తామని… ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఈమధ్యనే తమకు అర్థమయిందని ఆయన అన్నారు. ఇక నుంచి తెలుగు అమ్మాయిలను సినిమాలలో ప్రోత్సహించకూడదని తాను, డైరెక్టర్ సాయిరాజేశ్ నిర్ణయించుకున్నామని చెప్పారు. ఎస్కేఎన్ ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే చేశారని చెప్పుకుంటున్నారు. వైష్ణవిని ‘బేబీ’ సినిమాతో హీరోయిన్ గా ఎస్కేఎన్ పరిచయం చేశారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవి… ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ,…
Read More