సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీకి రెడీ అయిన రంభ టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్‌లో కూడా స్టార్‌గా వెలుగొందిన ఘనత రంభకు చెందింది. విజయవాడకి చెందిన ఈ తెలుగు అమ్మాయి అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లో రంభ అనే స్క్రీన్ నేమ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ కాలంలో దాదాపు అన్నీ టాప్ హీరోలతో నటించింది. బాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసింది. చివరిసారిగా ‘దేశముదురు’ చిత్రంలోని ఐటెం సాంగ్‌లో కనిపించింది. అనంతరం పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడిపోయింది. ఇటీవల రంభ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓ టీవీ డ్యాన్స్ షోలో జడ్జ్‌గా మారి మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల్లోకి రీఎంట్రీకి సిద్దమవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. రంభ చెప్పిన వివరాల ప్రకారం, పెళ్లి తర్వాత కెనడాలో స్థిరపడిందని, తల్లి…
Read More