గోపాలకృష్ణన్ మృతిపై ‘ఎక్స్’ వేదికగా రాజమౌళి సంతాపం మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. వివిధ చిత్రసీమలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గోపాలకృష్ణన్ మృతిపట్ల బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరితంగా స్పందించారు. “మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త కలచివేసింది. ఆయన రచనలు, కవిత్వం, సంభాషణలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మలయాళ వెర్షన్ల కోసం ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం చిరస్మరణీయం. ఆయనకు నా హృదయపూర్వక నివాళులు. ఓం శాంతి” అంటూ రాజమౌళి…
Read More