Peddi Movie: ‘పెద్ది’ టీం నుంచి క్రేజీ అప్‌డేట్

peddi

రామ్ చరణ్ ‘పెద్ది’ టీం నుంచి క్రేజీ అప్‌డేట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఊర మాస్ లుక్‌లో చరణ్ కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడివే జోష్‌కి కొనసాగింపుగా ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌ను ‘ఫస్ట్ షాట్’ పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఈ గ్లింప్స్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ గ్లింప్స్ మిక్సింగ్‌ను మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వయంగా పూర్తి చేసినట్లు మేకర్స్…

Read More