అంతర్జాతీయంగా మరో ఘనత సాధించిన ‘బాహుబలి-1’ మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ భారతీయ సినీ పరిశ్రమను గ్లోబల్ స్టేజ్‌పై నిలబెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకు తెచ్చాయి. తాజాగా ‘బాహుబలి – ది బిగినింగ్’ (బాహుబలి-1) అంతర్జాతీయంగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి-1 సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ ఎపిక్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్పానిష్ భాషలో కూడా విడుదలైంది. స్పానిష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను మరింత విస్తృతమైన అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేసే లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో…
Read More