అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ అర్జున్ సన్నాఫ్ వైజయంతి — కల్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తల్లీకొడుకుల మధ్య గాఢమైన ఎమోషన్ల నేపథ్యంలో సాగుతుంది. చాలా కాలం తర్వాత విజయశాంతి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ‘బింబిసార’ తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కల్యాణ్ రామ్‌కు ఇది బ్రేక్ ఇవ్వగలదేమో చూడాలి. కథా సారాంశం: కథ 2007లో విశాఖపట్నంలో మొదలవుతుంది. పోలీస్ కమిషనర్ వైజయంతి (విజయశాంతి) ఓ కఠినమైన, నిజాయితీ గల అధికారిణి. ఆమె భర్త విశ్వనాథ్ (ఆనంద్), తీర రక్షకదళంలో పనిచేస్తుంటాడు. వీరి కుమారుడు అర్జున్ (కల్యాణ్ రామ్), తల్లి కోరిక ప్రకారం ఐపీఎస్ కావాలనుకుంటాడు. శిక్షణ…
Read More