ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి – సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోందని తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనున్నట్లు సమాచారం. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు-అనిల్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గా ఉండబోతుందని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుండగా, 2026 సంక్రాంతికి విడుదల కావాల్సిన యోచనలో ఉన్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్…
Read MoreTag: Anil Ravipudi
Chiranjeevi : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి కొత్త చిత్రం
విలేజ్ బ్యాక్ డ్రాప్ ;ప చిరంజీవి కొత్త చిత్రం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, చాలా కాలం తర్వాత మళ్లీ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించనుండడం. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రానికి వినోదం ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హీరోయిన్‌గా అదితి రావు హైదరీ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదనంగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ ఆల్బమ్ అందించిన సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని సమాచారం.…
Read MoreAnil Ravipudi : చిరుతో తీయబోయే చిత్రానికి కథను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి
చిరు చిత్రానికి కథను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి 2026 సంక్రాంతికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. నిన్న ఆయన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా ఆయనతో కలిసి ఉన్నారు. చిరంజీవితో తెరకెక్కించనున్న చిత్రం కోసం స్క్రిప్ట్‌ను స్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్థంభాన్ని ఆలింగనం చేసుకున్న అనిల్ రావిపూడి, తన పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖను తన సినిమాల కోసం సెంటిమెంట్‌గా భావిస్తానని పేర్కొన్నారు. అందుకే చిరంజీవితో తెరకెక్కించనున్న సినిమా కథ సిద్ధం చేసేందుకు వైజాగ్ వచ్చానని వెల్లడించారు. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ఘరానా మొగుడు, గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు వంటి చిత్రాల్లో…
Read MoreSankranthiki Vasthunnam : మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా
మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ZEE5, ZEE తెలుగు చానళ్లలో ఒకేసారి ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. రేపు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన అనంతరం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ప్రత్యేకంగా ZEE తెలుగులో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ZEE5 ఓటీటీ వేదికపై తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా విడుదల చేస్తున్నారు, తద్వారా విభిన్న భాషల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. వెంకటేశ్ స్పందిస్తూ…‘‘ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించడం…
Read MoreAnil Ravipudi : దర్శకుడి కావాలనే కోరిక ‘పటాస్’తో తీరిందని, ఇప్పుడు అంతా బోనస్
వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘ . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇంకా ఆశాజనకమైన కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అనిల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీ సినిమాలోని కామెడీని కొందరి జబర్దస్త్ స్కిట్‌లతో పోల్చడంపై మీ స్పందన ఏమిటని అడిగిన ప్రశ్నకు అనిల్, “ప్రేక్షకులు నా ప్రతి సినిమాని ఇష్టపడతారు, నా ప్రతి సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు విని నేను…
Read More