Allari Maresh Bachala Malli : నేటి నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’

bachala malli poster

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘బచ్చల మల్లి’ OTTకి వచ్చింది. సంక్రాంతి కానుకగా నేటి నుంచి ‘ఈటీవీ’ విన్‌లో ప్రసారం కానుంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలైంది. నెల కూడా కాలేదు.  చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే బచ్చల మల్లికి తండ్రి అంటే చాలా ఇష్టం. అయితే తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం వల్ల బచ్చల మల్లి చిన్న వయసులోనే చెడు మార్గంలో పడుతాడు. కాలేజీ చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతున్నాడు. గొడవలకు దిగుతాడు. ఈ క్రమంలో కావేరి (అమృత అయ్యర్) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. Read : Aha OTT : ఆహా ఓటీటీ లో మరో క్రైమ్ థ్రిల్లర్!

Read More