ఇకపై పవర్ఫుల్ విలన్ రోల్స్ చేస్తాను : శివాజీ ‘కోర్ట్’… ఇప్పుడు అందరూ ఈ సినిమానే చర్చించుకుంటున్నారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం, నాని బ్యానర్‌కు భారీ విజయాన్ని అందించింది. ముఖ్యంగా, ఇందులో విలన్ పాత్ర పోషించిన శివాజీకి విపరీతమైన ప్రశంసలు లభించాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ ఈ చిత్రాన్ని గురించి మాట్లాడారు. “గతంలో నేను హీరోగా ఎన్నో సినిమాలు చేశాను. ఎంతో అంకితభావంతో కష్టపడ్డాను, కానీ నేను కోరుకున్న స్టార్‌డమ్ అందుకోలేకపోయాను” అని తెలిపారు. “ఎంతగా శ్రమించినా స్టార్‌డమ్ రాకపోవడంతో నాలో ఆవేదన పెరిగింది. అంతర్మథనం ఎక్కువైంది. అలాంటి సమయంలో నాకు ‘మంగపతి’ పాత్ర ఆఫర్ అయింది. కథ విన్నప్పుడే, ఇదే నా కోసం ఎదురుచూసిన పాత్ర అనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అంగీకరించాను” అని…
Read More