ఘనంగా నటి అభినయ వివాహం బహుభాషా నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తన చిరకాల స్నేహితుడు, హైదరాబాద్‌కి చెందిన వేగేశ్న కార్తీక్ (సన్నీ వర్మ)తో ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుక ఘనంగా జరగగా, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అభినయ, కార్తీక్ చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి వరకు చేరింది. అభినయ 2008లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘నేనింతే’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ముక్తి అమ్మన్’ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అభినయ గతంలో తమిళ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ‘మార్క్ ఆంటోనీ’…
Read More