ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్న టాలీవుడ్ ప్రముఖులు ట్విటర్ లో స్పందించిన విజయశాంతి ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో టాలీవుడ్ ప్రముఖులు మరియు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు అందరం కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని దిల్ రాజు తెలియచేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రితో సమావేశంపై హీరోలు, దర్శకనిర్మాతలకు దిల్ రాజు సమాచారం ఇచ్చారు. అయితే, ఈరోజు జరగబోయే సమావేశంపై కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి ‘ఎక్స్'(ట్విట్టర్) వేదికగా స్పందించారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి విశ్లేషనాత్మకంగా చర్చ జరగాలి. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, ఇతర రాయితీలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ…
Read More