‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్’తో కలిసి దిల్ రాజు ఏఐ స్టూడియో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో మంగళవారం సాయంత్రం “బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్” అంటూ ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ హింట్‌కి తగ్గట్టే, ఈరోజు ఉదయం 11:08కి సంస్థ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. ప్రఖ్యాత ఏఐ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి, ఒక ఆధునిక ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన అత్యాధునిక ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేయడమే ఈ కొత్త సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ స్టూడియో పేరుతో పాటు మరిన్ని వివరాలను మే 4న అధికారికంగా ప్రకటించనున్నట్టు…
Read More