ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమావేశం అయ్యారు. సోమవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలనుకుంటున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరినట్లు తెలిపారు. దీనికి పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం. దిల్ రాజు, పవన్ మధ్య జరిగిన భేటీకి గాను గేమ్ ఛేంజర్ నిర్మాణ సంస్థ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.…
Read More