నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను, అభిమానులను అలరించాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చిత్ర బృందం గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఇటీవల అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్లో నందమూరి బాలకృష్ణ మరోసారి గాయకుడిగా మారారు. బాలకృష్ణ సినిమాలోని ఓ పాట పాడి అభిమానులను అలరించారు. బాలయ్య పాట పాడుతుండగా అభిమానులు కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Read : Chiranjeevi : తమన్ ఆవేదనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చిరంజీవి
Read More