కాకినాడ శ్రీదేవి – ‘కోర్ట్’తో కొత్త స్టార్ జన్మించిందా? ‘కోర్ట్’ సినిమా చూసినవారికి ఈ కాకినాడ బ్యూటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు ముందే ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ద్వారా ఈ అమ్మాయిని చూసినా, పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. గ్లామర్ షో లేకపోయినా, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని మాత్రమే అనుకున్నారు. కానీ, నిన్న సినిమా చూసినవాళ్లు శ్రీదేవి అభిమానులుగా మారిపోతూ థియేటర్ నుంచి బయటకొచ్చారు. ఆ మార్పుకి కారణం – ఆమె సహజమైన నటన. శ్రీదేవి – ఆరంభం నుంచి ‘జాబిల్లి’గా ముద్ర వేసిన నటన ఇంతకుముందు కొన్ని చిన్న పాత్రలు చేసినట్టు శ్రీదేవి ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ, ఆ సినిమాలు ఇప్పుడు చూసినా గుర్తు పట్టలేమేమో! కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ, రీల్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మాయికి ‘కోర్ట్’ నుంచి ఛాన్స్…
Read More