ఐఫా ఉత్తమ నటి అవార్డు గెల్చుకున్న కృతి సనన్ ఓటీటీ సినిమాల విభాగంలో ఉత్తమ నటిగా కృతి సనన్ ఐఫా అవార్డును గెలుచుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం ప్రారంభమైన ఐఫా అవార్డుల వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజున బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఐఫా నిర్వాహకులు డిజిటల్ అవార్డులను ప్రకటించారు. ఓటీటీలో విశేష ఆదరణ పొందిన “అమర్ సింగ్ చంకీలా” సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించారు. “దో పత్తి” సినిమాలో తన నటనకు గానూ కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును అందుకోగా, “సెక్టార్ 36” చిత్రంలో నటించిన విక్రాంత్ మస్సే ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఆదివారం సాయంత్రం ఈ అవార్డులను అధికారికంగా ప్రధానం చేయనున్నట్లు ఐఫా నిర్వాహకులు తెలిపారు. ఇతర అవార్డులు గెలుచుకున్నవారు: ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్…
Read More