అందులో ఎలాంటి నిజం లేదు అవన్నీ పుకార్లే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాను చుట్టూ జరుగుతున్న ప్రచారంపై చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు నిరాధారమైనవని, అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్ షో నిర్వహించారని వస్తున్న వార్తలు అసత్యమని, అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని చిత్ర బృందం కోరింది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకు సంబంధించిన కొంత ఫుటేజ్‌ను మాత్రమే సమీక్షించామని, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలియజేశారు. కావాలనే సినిమాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కన్నప్ప’లో భారీ స్థాయిలో VFX పనులు ఉన్న కారణంగా ప్రతీ ఫ్రేమ్‌ను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నామని, అందువల్ల ఎక్కువ సమయం…
Read More