– అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 30కి వాయిదా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. తొక్కిసలాట ఘటనలో ఇటీవల బన్నీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు వారాల్లోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు ఈ నెల 13న విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో బన్నీ ఈరోజు వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై…
Read More