పుష్ప 2 మూవీ రివ్యూ : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 వచ్చింది. గత మూడేళ్ళుగా ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా నేడు డిసెంబర్ 5న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్, రావు రమేష్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, ధనుంజయ, శ్రీతేజ.. పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కథ విషయానికొస్తే.. పుష్ప రాజ్(అల్లుఅర్జున్) ఎర్రచందనం సిండికేట్ ప్రసిడెంట్ గా బాగా ఎదుగుతాడు. చిత్తూర్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకొని ఎర్ర చందనం స్మగ్లింగ్ తో బాగా సంపాదిస్తాడు.…
Read More