యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయలాన్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ మూవీని కోటపడి జె రాజేష్ గ్రాండ్ లెవెల్లో కెజెఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ ఎక్స్ స్టూడియోస్, ఆదిబ్రహ్మ ప్రొడక్షన్స్ సంస్థల పై నిర్మించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు శరద్ కేల్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. విషయం ఏమిటంటే, తాజాగా అయలాన్ ఓటిటి అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ప్రముఖ ఓటిటి మాధ్యమం సన్ నెక్స్ట్ లో ఈ మూవీ ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది.…
Read More