చిరు చిత్రానికి కథను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి 2026 సంక్రాంతికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. నిన్న ఆయన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా ఆయనతో కలిసి ఉన్నారు. చిరంజీవితో తెరకెక్కించనున్న చిత్రం కోసం స్క్రిప్ట్‌ను స్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్థంభాన్ని ఆలింగనం చేసుకున్న అనిల్ రావిపూడి, తన పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖను తన సినిమాల కోసం సెంటిమెంట్‌గా భావిస్తానని పేర్కొన్నారు. అందుకే చిరంజీవితో తెరకెక్కించనున్న సినిమా కథ సిద్ధం చేసేందుకు వైజాగ్ వచ్చానని వెల్లడించారు. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ఘరానా మొగుడు, గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు వంటి చిత్రాల్లో…
Read More