Sikandar Teaser: సల్మాన్ ఖాన్ ‘సికింద‌ర్’ టీజ‌ర్ విడుదల

sikandar
  • స‌ల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో ‘సికింద‌ర్’

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సికిందర్’. భావోద్వేగాలు, యాక్షన్ మేళవించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

సల్మాన్ ఖాన్ తన శైలిలోనే పవర్ఫుల్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టగా, మురుగదాస్ తన టేకింగ్‌తో టీజర్‌ను విశేషంగా మలిచారు. రిచ్ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

 

Read : Kousalya Supraja Rama Review : కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ 

 

Related posts

Leave a Comment