ప్రముఖ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడికల్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ స్పోర్ట్స్మెన్గా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా ఈ లుక్ కోసం మేకోవర్ చేస్తున్నాడు. అయితే ‘గేమ్ ఛేంజర్’ విడుదల తర్వాత చరణ్ ఏ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే తాజాగా రామ్ చరణ్ లుక్ రివీల్ అయింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి బండ్రెడ్డి నటించిన ‘గాంధీ తాత చెట్టు’ ఈ శుక్రవారం విడుదలైంది.
సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది, ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సుకృతి నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో పాటు ‘గాంధీ తాట చెట్టు’ టీమ్‌తో కలిసి సుకృతిని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడు ఈ ఫోటోల్లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read : Amazon Prime : ‘సివరపల్లి’ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ!