Prabhudeva : వారసుడు రిషి రాఘవేంద్రను పరిచయం చేసిన ప్రభుదేవా!

prabhudeva
  • వారసుడు రిషి రాఘవేంద్రను పరిచయం చేసిన ప్రభుదేవా!

భారతీయ సినిమా నృత్య చరిత్రలో ప్రభుదేవా పేరు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఒంట్లో ఎముకలున్నాయా లేదా అన్నట్లుగా స్ప్రింగులా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ప్రభుదేవా మాస్టర్‌కు చెందిన ప్రత్యేకత. మైకేల్ జాక్సన్ కు భారతీయ వెర్షన్ గా పేరు పొందిన ప్రభుదేవా, కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా కూడా తన బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు.

తాజాగా, ప్రభుదేవా తన వారసుడిని ఒక ఈవెంట్ లో పరిచయం చేశారు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రభుదేవా, ఆయన కొడుకు రిషి రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు హాజరై, తండ్రీకొడుకులు కలిసి డ్యాన్స్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసారు. ఈ వీడియోను ప్రభుదేవా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు.

ఇప్పుడు, కొడుకు రిషి రాఘవేంద్రతో ఉన్న తాజా ఫొటోను ప్రభుదేవా ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. “కంటిన్యుటీ” అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఆయన కొడుకు తన వారసత్వాన్ని కొనసాగిస్తాడని ఆయన ఈ ట్వీట్ ద్వారా సూచించినట్లు కనిపిస్తోంది.

 

https://www.instagram.com/reel/DGfv3a0yfmV/

 

Read : Kunchacko Boban : ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ .. భారీ వసూళ్లు

Related posts

Leave a Comment