Pawan Kalyan: అభిమానుల మృతి… అయిదు లక్షలు పరిహారం ప్రకటించిన పవన్ కల్యాణ్
గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు. జనసేన తరపున రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని తెలిపారు. ఒక్కొక్కరికి 5 లక్షలు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన కాకినాడ-రాజమండ్రి రహదారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. గత కొంత కాలంగా చెడిపోయిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే కాకినాడ జిల్లా గైగొలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్‌లు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
క్షేమంగా ఇంటికి వెళ్లాలని ఈ కార్యక్రమంలో రెండు సార్లు చెప్పానని పవన్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు జనసేన తరపున ఒక్కొక్కరికి 5 లక్షలు… ప్రభుత్వం తరపున తగిన సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. అలాగే ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లేందుకు ఏడీబీ రోడ్డు మీదుగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Read : SSMB29 : మొదలైన ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ షురూ