Naga Chaitanya : అక్కినేని నాగేశ్వరరావుపై మోడీ ప్రశంసలు – ధ్యాంక్స్ చెప్పిన నాగచైతన్య దంపతులు
అక్కినేని నాగ చైతన్య, ఆయన సతీమణి శోభిత ధూళిపాళ్ల ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుపై మోదీ ప్రశంసలు కురిపించడమే ఇందుకు కారణం. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడని, భారతీయ విలువలు, సంప్రదాయాలు, సంస్కృతిని సినిమాల్లో చక్కగా చూపించేవాడని మోదీ కొనియాడారు. దీనిపై చైతూ, శోభిత సోషల్ మీడియాలో స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుగారి కళా నైపుణ్యాన్ని, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను మీరు అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ నుండి ప్రశంసలు అందుకోవడం మా అదృష్టం. మా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ చైతూ, శోభిత పోస్ట్ చేశారు.
కాగా, తన తండ్రిని ప్రధాని మోదీ ప్రశంసించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ హీరో నాగార్జున ఇప్పటికే ఓ పోస్ట్ పెట్టారు. “దిగ్గజ దిగ్గజాలతో పాటు మా నాన్నను గౌరవించినందుకు ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, మా నాన్న శతజయంతి సందర్భంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ పట్ల ఆయన చూపిన దార్శనికత, ఆయన అందించిన సేవలు ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఈరోజు మీ ప్రత్యేక ప్రస్తావనతో నా కుటుంబంతో పాటు మా నాన్నగారి నటనను ఇష్టపడే అసంఖ్యాక అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు’’ అని నాగార్జున తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read : Chiranjeevi: తండ్రి వర్ధంతికి చిరంజీవి, కుటుంబం నివాళి