నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు హీరో నాగచైతన్య ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన స్థాపించిన రెస్టారెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎప్పుడు జరిగిందంటే… జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవర జపనీస్ వర్షన్ మార్చి 28న జపాన్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వివిధ అంశాలపై మాట్లాడుతుండగా, ఫుడ్ గురించి చర్చ వచ్చింది. అప్పుడు ఆయన నాగచైతన్య రెస్టారెంట్ గురించి ప్రస్తావించారు. “జపనీస్ ఫుడ్ కావాలంటే కచ్చితంగా హైదరాబాద్‌లోని షోయూ రెస్టారెంట్‌కు వెళ్లండి. ఇది నా స్నేహితుడు, నటుడు నాగచైతన్య ప్రారంభించిన రెస్టారెంట్.…
Read MoreCategory: Movie Updates
Daily Movie Updates
Kannappa : ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్
‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా… క్షమాపణ కోరుతూ మంచు విష్ణు పోస్ట్ మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాలతో ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరింత సమయం అవసరం అవుతుందని, అందువల్ల విడుదలను వాయిదా వేయవలసి వచ్చిందని వివరించారు. “‘కన్నప్ప’ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు మా టీం ఎంతో కష్టపడుతోంది. మంచి అవుట్‌పుట్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొన్ని వారాలు పట్టే అవకాశం ఉన్నందున సినిమా విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం తీసుకోవడం బాధగా ఉంది, కానీ ప్రేక్షకుల ఓపిక,…
Read MorePrabhas : పెళ్లి వార్తలను ఖండించిన ప్రభాస్
పెళ్లి వార్తలను ఖండించిన ప్రభాస్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయితో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందంటూ, త్వరలోనే వివాహం జరగనున్నట్లు పుకార్లు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను నెటిజన్లు ఈ వార్తలతో కలిపి వైరల్ చేస్తున్నారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ఆ షోలో రామ్ చరణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఆ అమ్మాయి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడిందని, ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీమ్ స్పందించింది. ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి…
Read MoreSamantha : సిడ్నీ ఫోటోలు షేర్ చేసిన సమంత
Samantha : సిడ్నీ ఫోటోలు షేర్ చేసిన సమంత ప్రముఖ నటి సమంత తన ఆస్ట్రేలియా విహారయాత్ర గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. సిడ్నీలోని ఫెదర్‌డేల్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గడిపిన ఒకరోజు అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిన సమంత, పార్క్‌లోని అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ, అందమైన జంతువులను దగ్గరగా పరిశీలించారు. ఆమె తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గ్రే కలర్ ఫుల్-స్లీవ్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి, టోపీ పెట్టుకుని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో తిరుగుతూ కనిపించారు. ఒక చిత్రంలో ఆమె పర్వతాల సుందర దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఉండగా, మరో వీడియోలో కోలా చెట్టు కొమ్మపై ఆసక్తిగా చూస్తూ కనిపించారు. ఈ పోస్ట్‌కు ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్ అనే ట్యాగ్‌ను జోడించారు. “ప్రకృతి, జంతువులు,…
Read MoreL2 Empuraan : ‘ఎల్-2 ఎంపురన్’ మూవీ రివ్యూ
L2 Empuraan : ‘ఎల్-2 ఎంపురన్’ మూవీ రివ్యూ మలయాళ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘లూసిఫర్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్‘. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో, ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి పెరిగింది. అసలు ఈ కథ ఏమిటి? ఈ సినిమాలోని రాజకీయ నేపథ్యం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? వివరంగా తెలుసుకుందాం. కథ: ‘లూసిఫర్’ ముగిసిన చోటినుంచి ‘ఎల్2: ఎంపురాన్’ ప్రారంభమవుతుంది. పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణంతో, అతని పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగుతాయి. స్టీఫెన్ వట్టిపల్లి (మోహన్‌లాల్) జతిన్ రామదాస్ (టోవినో థామస్)ను సీఎంగా నిలబెట్టిన తర్వాత అదృశ్యమవుతాడు. అయితే, అధికారంలోకి వచ్చిన జతిన్ అక్రమాలకు పాల్పడుతుండటంతో, పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి పరిపాలన సాగిస్తాడు. జతిన్ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చి ‘ఐయూఎఫ్…
Read MoreRamcharan : చెర్రీకి సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పిన Jr. NTR
చెర్రీకి సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పిన Jr. NTR ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చెర్రీకి సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కూడా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తారక్ ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మీపై ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలి” అని ఎన్‌టీఆర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, చరణ్, తారక్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అదరగొట్టిన విషయం తెలిసిందే. అల్లూరిగా చెర్రీ, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ నటన…
Read MoreRamcharan : ‘ఆర్‌సీ 16’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘RC 16‘ నుంచి భారీ అప్‌డేట్ వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా, ఉదయం 9.09 గంటలకు ఈ చిత్రపు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా, “యుద్ధంలో నిర్భయుడు.. మనస్సులో కనికరం లేనివాడు. రేపు ఉదయం 9.09 గంటలకు కలుద్దాం” అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుండగా, శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్…
Read MoreChiranjeevi : ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం
ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి – సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోందని తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనున్నట్లు సమాచారం. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు-అనిల్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గా ఉండబోతుందని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుండగా, 2026 సంక్రాంతికి విడుదల కావాల్సిన యోచనలో ఉన్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్…
Read MoreAmy Jackson: మరో బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్
మరో బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్ సినీ నటి అమీ జాక్సన్ మరోసారి తల్లి అయ్యింది. ఆమె ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన వార్తను అమీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన కుమారుడికి ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్ విక్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. భర్త, తన బిడ్డతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, ఈ ప్రత్యేక క్షణాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ వార్తను తెలుసుకున్న అభిమానులు అమీ జాక్సన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అమీ జాక్సన్ సినీ ప్రస్థానం అమీ తొలుత మోడలింగ్ రంగంలో రాణించింది. ఆమె తమిళ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2010లో విడుదలైన ‘మద్రాస్ పట్టణం’ సినిమాతో సినిమా ప్రపంచంలోకి ప్రవేశించింది. పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు…
Read MoreRajendra Prasad : వార్నర్‌పై వ్యాఖ్యలు… క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్
‘రాబిన్‌హుడ్’ ఈవెంట్‌లో వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వార్నర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీనిపై నెటిజన్లు విమర్శలు చేశారు. తాజాగా ఈ అంశంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. “నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. రాబిన్‌హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ గురించి నేను అనుకోకుండా కొన్ని…
Read More