Keerthy Suresh : సమంత వల్లే తనకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందన్న కీర్తి
సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘బేబీ జాన్’ తమిళ చిత్రం ‘తేరి’కి రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాలో అవకాశం రావడం గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ… సమంత వల్లే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ‘తేరి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించినప్పుడు సమంత తన పేరును సూచించినట్లు కీర్తి సురేష్ వెల్లడించారు. తమిళంలో సమంత పోషించిన పాత్రను హిందీలో పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు సమంత తన పేరు సూచించినప్పుడు భయపడ్డానని… అయితే సమంత తనకు చాలా సపోర్ట్ చేసిందని చెప్పింది. సమంత ఇచ్చిన ధైర్యంతోనే సినిమా పూర్తి చేశానని చెప్పింది. ‘బేబీ జాన్’ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, జాకీ ష్రాఫ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు పోషించారు.
Read : Srikanth Odela: చిరంజీవితో సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటరెస్టింగ్ కామెంట్స్