Kalyan Ram : #NKR21 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
#NKR21 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-ఆక్టేన్ మూవీ యాక్షన్, ఎమోషనల్ డెప్త్ బ్లెండ్ తో ఉండబోతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న #NKR21 ప్రేక్షకులకు థ్రిల్లింగ్ రైడ్ ఇవ్వబోతోంది.పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న సోహైల్ ఖాన్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టన్నింగ్ పోస్టర్‌లో సొహైల్ ఖాన్ బ్లాండ్ అండ్ బ్లాక్ లో గ్లాసెస్ ధరించి స్టైలిష్ పవర్ ఫుల్ ప్రెజన్స్ తో కనిపించారు. ఈవిల్డోర్ గా అతని పాత్ర హైలైట్‌గా ఉంటుంది.
ముఖ్యంగా హీరోతో పేస్ అఫ్ రివర్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా, కళ్యాణ్ రామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, శ్రీకాంత్, సాయి మంజేరకర్, యానిమల్ పృథ్వీవీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందించారు.నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్ & తదితరలు.
Read : Allari Naresh : AV లో తన నాన్న ని చూడగానే ఎమోషనల్ అయిన అల్లరి నరేష్