Movie Updates

Hero Venkatesh:విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రోమో రిలీజ్

_విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్-

_’సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి హీరో వెంకటేష్ ను క్లాసిక్ కాప్ లుక్‌

_సెకండ్ సింగిల్ మీను ప్రోమో రిలీజ్

విక్టరీ వెంకటేష్ చాలా సినిమాల్లో పోలీసు పాత్రలు పోషించినప్పటికీ ఆయన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం‘ లో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలోని మేజర్ పార్ట్ ఎక్స్ పోలీసుగా, ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై బ్లాక్‌బస్టర్‌ మెషిన్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రోజు, వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ సెకండ్ సింగిల్- మీను ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమోలో వెంకటేష్ తన ఎక్స్ లవర్ మీను (మీనాక్షి చౌదరి)ని సరదాగా ఆటపట్టిస్తూ, అతని భార్య (ఐశ్వర్య రాజేష్) కూడా ఉల్లాసంగా ఉండే ఇంటి వేడుకను ప్రజెంట్ చేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తుండగా, మీనాక్షి ట్రెండీ ఎటైర్ కనిపిస్తుంది.

స్టైలిష్ కాప్‌గా వెంకటేష్ అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోమోలో వండర్ ఫుల్ మూమెంట్. ఖాకీ యూనిఫామ్‌లో సన్ గ్లాసెస్‌తో ధరించి, వెంకటేష్ క్లాసిక్ కాప్ లుక్‌ లో కనిపించారు. సీక్వెన్స్‌లోని గ్లింప్స్ కథాంశంలోని బ్రెత్ టేకింగ్ పార్ట్ ని సూచిస్తుంది, అతని డైనమిక్ ప్రజెన్స్ అభిమానులని కట్టిపడేసింది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఫస్ట్ సింగిల్ లాగానే క్యాచీగా ఉంటుందని హామీ ఇచ్చింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

Read : Sukumar: ‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *